కామారెడ్డి : భిక్కనూరులో రైతు పంట రుణమాఫీ సంబురాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్తం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పంటల రుణమాఫీ చేసిందని మంత్రి జూపల్లి తెలిపారు. రైతులు పంటలు వేసుకునే సరైన సమయంలో రుణమాఫీ చేశామని, ఈ ప్రభుత్వం వచ్చాక 6 నెలలు సభలు, ఎన్నికలకే సమయం సరిపోయిందని జూపల్లి పేర్కొన్నారు.
అర్నెళ్లకే 6 గ్యారెంటీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ నేతలు అడిగారన్నారు. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్ర అప్పు రూ.70 వేల కోట్లాని, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో 7 లక్షల కోట్లు అప్పు చేశాడని ఆయన ఎద్దెవా చేశారు. కేసీఆర్ చేసిన అప్పుకు ప్రతినెలా రూ.5 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.