హైదరాబాద్: గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణరావు గురువారం భేటీ అయ్యారు. ఇటీవల తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్టు కృష్ణమోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు మంత్రి జూపల్లి రంగంలోకి దిగారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు కృష్ణమోహన్‌రెడ్డి రెడీ అయినట్లు సమాచారం.