calender_icon.png 13 December, 2024 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి రాకతో సీనియర్ నాయకుల ముందస్తు అరెస్టులు

13-12-2024 12:31:35 PM

అరెస్ట్ లతీరును నిరసిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు

జుక్కల్, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో గ్రూపు రాజకీయాలకు కేరాప్ గా ఉన్న జుక్కల్, బాన్సువాడ, నియోజకవర్గంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలపై పోలిస్ జులుం నడుస్తుంది. మొన్నటికి మొన్న జిల్లా ఇంచార్జీ మంత్రి జుపల్లి కృష్ణారావు జుక్కల్ పర్యటనల నేపథ్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టు చేయించిన ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు తనంటే గిట్టని నేతలపై బల ప్రయోగం చేస్తున్నారు. శుక్రవారం నిజాం సాగర్ నీటిని విడుధలకు చేసేందుకు భారీ నీటి పారుధల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనకు ముందస్తుగా పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేతలను అరెస్టు చేశారు. 

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాజీ జెడ్పిటిసి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయప్రదిప్ ను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తోట లక్ష్మీకాంతరావు ను జుక్కల్ ప్రజలకు పరిచయం చేసి, తన భుజాలపై మోసి, ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సంవత్సర కాలంలోనే తనపై కక్ష సాధింపు చర్యలతో, సొంత పార్టీ నేతలు అరెస్టు చేయడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే తీరు మార్చకపోతే తగిన గుణపాఠం చెప్తామని అన్నారు.ఈ విషయంపై కాంగ్రెస్ ఆగ్యక్షుడు మహేష్ గౌడ్ దృష్టికి, సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్త ను కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని చూస్తున్నారు అని అరోపించారు.