28-02-2025 11:35:49 AM
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌పై మాట్లాడే అర్హత బీర్ఎస్ నేతలకు లేదు
హైదరాబాద్: పదేళ్లలో 200 కి.మీ టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేశామని హరీశ్ రావు అన్నారు. 200 కి.మీ టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేసిన బీఆర్ఎస్ ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను ఎందుకు పూర్తి చేయలేదు? అని మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. టన్నెల్ పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరొస్తుందని పూర్తి చేయలేదా? అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే హరీశ్ రావు మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సంఘటనాస్థలికి రాలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఇలాంటి తరహా ఘటనలు జరిగినప్పుడు కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) వెళ్లారా? అని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తును కూడా బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని ఆయన హెచ్చరించారు. గత బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ప్రభుత్వం డబ్బుల్లేక ఎస్ఎల్ బీసీ పూర్తి చేయలేదా? అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు.