calender_icon.png 21 March, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ రేవంత్ రెడ్డి ఆలోచన

20-03-2025 03:19:32 PM

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. మే నెలలో హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao), మిస్ వరల్డ్ సీఈవో మోర్లే, మిస్ వరల్డ్ క్రిస్టినా(Miss World 2024 Krystyna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... అందాల పోటీలను మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలని పిలుపునిచ్చారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు వస్తాయన్నారు. మిస్ వరల్డ్ పోటీల ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆలోచననుంచి వచ్చిందని ఆయన తెలిపారు. 

తెలంగాణ ఆర్థికంగానూ వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నామని జూపల్లి పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణకు మంచి అవకాశముందని తెలిపారు. దీంతో రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. రాజకీయ కోణంతో మిస్ వరల్డ్ పోటీలను చూడటం సరికాదని తెలిపారు. మే 7 నుండి 31 వరకు జరిగే 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతుండటంతో, అందం, సంస్కృతికి ప్రపంచ వేదికగా మారనుంది. ఈ కార్యక్రమంలో 140 దేశాల నుండి పోటీదారులు ప్రతిష్టాత్మక టైటిల్ కోసం పోటీ పడతారు. ఇది రాష్ట్రానికి ఒక ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది. ఇది దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం, ప్రపంచ ఆశయాలను ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంది.