calender_icon.png 8 January, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళాడు

07-01-2025 12:53:07 PM

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయింది

రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ గోబెల్స్ ప్రచారం

రాష్ట్ర టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కామారెడ్డి,(విజయక్రాంతి): కేటీఆర్ తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారని రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Tourism and Excise Minister Jupally Krishna Rao) అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. ఏసీబీ(ACB) విచారణకు కేటీఆర్(KTR) సహకరించాలని, ఏసీబీ పిలుపుకు హాజరుకావాలని మంత్రి అన్నారు. కేటీఆర్ కేసును పేస్ చేయాలని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే భూస్థాపితం అయిందని, రాబోయే రోజుల్లో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోతుందన్నారు. అధికారం కోల్పోయామని అక్కస్తో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బురద జల్లుతున్నారని, రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.

బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. తెలంగాణను ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని తెలిపారు. దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామరక్ష అని, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కి గ్యాస్ సిలిండర్, ప్రతి పేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గృహజ్యోతి పథకం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇల్లు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం(Indiramma Atmiya Bharosa Scheme) కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా మంత్రులను, అధికారులను కలుస్తున్నారని గత ప్రభుత్వ హయంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకే సీఎంని కలిసే అవకాశం లేకుండాపోయిందన్నారు.

గరీబోళ్ల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పేరును చూసి ఓర్వలేక తప్పుడు ప్రకటనలు చేస్తూ టిఆర్ఎస్ నేతలు ఖుషి అవుతున్నారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్కు మరింత బుద్ధి చెప్తారని అన్నారు. గతంలో రాష్ట్ర చరిత్రలో ఎన్న డు లేని విధంగా ఏ పాలకులు చేయని అప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. గత ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసిందని తెలిపారు అసలు వడ్డీ కలిపి నెలకు 6500 కోట్లు తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు అని అన్నారు. దళిత సీఎం ను చేస్తానని దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట మర్చిపోయారన్నారు. బి ఆర్ ఎస్ పాలనలో ప్రగతి భవన్ సచివాలయంలోనికి పోలేని పరిస్థితులు ఉండేవని తెలిపారు. .ఈ సమావేశంలో జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.