calender_icon.png 24 November, 2024 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన విజయోత్సవ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యేలు

24-11-2024 03:22:23 PM

ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించిన మంత్రి జూపల్లి కృష్ణారావు 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది గడుస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవ సభా ప్రాంగణాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా పరిశీలించారు. ఆదివారం అమిస్తాపూర్ దగ్గర బహిరంగ సభకు అవసరమైన స్థలాన్ని ప్రత్యేక ట్రాక్టర్ల ద్వారా చదును చేశారు. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు శభాష్ తల్లిని పరిశీలించి ప్రత్యేకంగా సంభాషించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రజా పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవనం సాగిస్తున్నారని, ఎవరిపై కూడా అనవసరమైన వంటి రాజకీయ ఒత్తిడి లేకుండా పరిపాలన సాగించడం కాంగ్రెస్ పార్టీ విధానమని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడు జి. చెన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి , మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,  ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్,  డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, రెవెన్యూ , పోలీసు శాఖ,  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.