29-03-2025 01:24:46 AM
మంత్రి జూపల్లి చేతుల మీదుగా నూతన బస్సులు ప్రారంభం
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కొల్లాపూర్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. కొల్లాపూర్ డిపో పరిధిలో మంజూరైన 10 ఆర్టీసీ నూతన బస్సులను శుక్రవారం బస్ డిపో వద్ద అయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోందని అన్నారు.