మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...
మంథని (విజయక్రాంతి): మంథని నుంచి మంచిర్యాలను కలుపుతూ గోదావరి నదిపై రూ.140 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేసుకున్నామని, అదే విధంగా మంథనికి రింగ్ రొడ్డు నిర్మాణం వల్ల పట్టణ విస్తరణ పెరుగుతుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) తెలిపారు. మంగళవారం నాడు మంథనిలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెల్లడించారు. పట్టణ విస్తరణ జరిగితూ దేశ, విదేశాలలో స్థిర పడిన ప్రజలు సొంత గ్రామాల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు, ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రోడ్ల అభివృద్ధి ద్వారా వాణిజ్య సదుపాయాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. మంత్రి పర్యటనలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Collector Koya Sri Harsha), అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ, మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కౌన్సిలర్లు స్థానిక నేతలు పాల్గొన్నారు.