పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా బాడ్డింటన్ అధ్యక్షులుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu)ను జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి అంతటి అన్నయ్య గౌడ్ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. రాష్ట్ర బ్యాట్మెంటన్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీధర్ బాబు ముందుగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావలసి ఉండగా, ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న చందుపట్ల రమణ కుమార్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి జిల్లా కార్యవర్గం ఆదేశాల మేరకు శ్రీధర్ బాబును అధ్యక్షునిగా నియమించి, రమణ కుమార్ రెడ్డి ఉపాధ్యక్షునిగా, ట్రేజర్ గా మడతా రమేష్ ను, కార్యవర్గ సభ్యులుగా రాజేష్ ను నియమించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి అంతటి అన్నయ్య గౌడ్ తెలిపారు.