calender_icon.png 19 November, 2024 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైర్మన్‌గా మంత్రి దామోదరను నియమించాలి

14-09-2024 02:40:35 AM

బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీకి మంత్రి దామోదర రాజనర్సింహాను చైర్మన్‌గా నియమించాలని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.  శుక్రవారం ఆయన ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు. దశాబ్దాల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తీర్పుని చ్చిందన్నారు. ఏండ్లపాటు అటు కేంద్రం లో.. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రాజ్యాంగం కల్పి ంచిన హక్కులను కాలరాసిందన్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అదే కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలను మోసం చేసేందుకు యత్నిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు వేసిన కమిటీకి అగ్రవర్ణ కులానికి చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు, ప్రస్తుతం క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న మాదిగ వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహాను చైర్మన్‌గా నియమించకపోవడం లో ఆంతర్యం ఏమిటని అడిగారు.

దీంతో మాదిగలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధపడినట్లు తేలిపోయిందని మండిపడ్డారు. అగ్ర కులానికి చెందిన వ్యక్తి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీతో తమకు ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు.