calender_icon.png 12 January, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది: మంత్రి దామోదర రాజనర్సింహ

01-08-2024 11:42:59 AM

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని ధర్మాసనం తెలిపింది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం వర్గీకరణ. సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఇవాళ న్యాయం, ధర్మం గెలిచింది. తమ ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్న మంత్రి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచిందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.