29-03-2025 03:24:30 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ దత్త క్షేత్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించి, శనైశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా చెర సంఘం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో ఉన్న దత్తగిరి ఆశ్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శని అమావాస్య రావడంతో శని యజ్ఞం, పూర్ణాహుతి నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్, తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .