calender_icon.png 10 January, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట

03-01-2025 03:57:40 PM

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ 

సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలో పురపాలక శాఖ(Sangareddy Municipal Administration Department) ఆధ్వర్యంలో పట్టణంలో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయాలనే సంకల్పంతో రూ.44 కోట్లతో అమృత్ జల పథకాన్ని(Amrit Jal Scheme) రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) ప్రారంభించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పర్యటన లో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయ భవనాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రం లో మహిళల చేత నిర్వచించే తోలి పెట్రోల్ పంపు ను 2 కోట్ల రూపాయలతో ఇండియన్ ఆయిల్ పంపు ఏర్పాటు కు శంకుస్థాపన చేశారు.

 మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..

సంగారెడ్డిలో  మహిళల ఆధ్వర్యంలో తొలి పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. మహిళలు చదువుకుంటే సమాజంలో ఒక మార్పు వస్తుందన్నారు. సావిత్రి భాయ్ ఫూలే స్ఫూర్తిని తీసుకుని ముందుకుపోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. 1993లో ఆందోల్ లో మహిళా సంఘాలకు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. మహిళలు సంపూర్ణంగా అన్ని రంగాలలో ఎదగాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు. స్వయం ఉపాధిని పెంచుకునే విధంగా మహిళలు ఆలోచించాలని సూచించారు. విద్యతో ధైర్యం, స్థైర్యం పెరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళలు ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు.

మహిళా సమాఖ్య సభ్యులు అనేక అభివృద్ధి పనులతో పాటు  స్వయం ఉపాధి సాధించేలా తమ కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్య(District Women's Federation)కు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘు నందన్ రావు, స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, ఫహీం, కలెక్టర్ క్రాంతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.