18-03-2025 02:03:52 PM
రిజర్వేషన్ల ఫలాలు అందికీ అందాల్సిన అవసరం లేదు
వర్గీకరణ మాత్రమే అంతిమ పరిష్కారం కాదు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Session) ఐదవరోజు కొనసాగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తరుఫున మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయం దినంగా ప్రకటించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ(Congress party) ఎప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ యువతకు ఆదర్శం అన్నారు. కుల వ్యవస్థగా దిగజారుకుంటూ పంచమ వ్యవస్థగా మారిందని తెలిపారు.
చాతుర్వర్ణ వ్యవస్థ(Chaturvarna system) క్రమంగా పంచమ వ్యవస్థగా మారింది.. పంచములు.. అస్పృశ్యత, అంటరానితనానికి గురయ్యారు. కుల వ్యవస్థ భారతదేశాన్ని బలహీనపరుస్తుందని గాంజీజీ అన్నారని రాజనర్సింహ తెలిపారు. సామాజిక న్యాయం కోసం గాంధీ, అంబేద్కర్, పూలే పోరాడారని చెప్పారు. కులవ్యవస్థ కారణంగా దళితులు వివక్షకు గురయ్యారు. వివక్షను రూపుమాపేందుకు రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ(Classification of SC) జరపాలని మొదట లోకూర్ కమిటీ సిఫారుసు చేసింది.
లోకూర్ కమిటీ( Lokur Committee) ఎస్సీ వర్గీకరణ చేయాలని 1965లోనే సూచించిందని ఆయన పేర్కొన్నారు. మొదటగా పంజాబ్(Punjab)లో ఎస్సీ వర్గీకరణ అమలైందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిటీ(Justice Shamim Akhtar Committee) 2 నెలల్లో నివేదిక సమర్పించిందని రాజనర్సింహ తెలిపారు. మూడు గ్రూపులుగా ఎస్సీల్లోని 59 కులాలు, మాదిగలున్న గ్రూప్-2 లోని కులాలకు 9శాతం రిజర్వేషన్లు, మాలలు ఎక్కువ ఉన్న గ్రూప్-3లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు, అత్యంత వెనుకబడిన 15 కులాలకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. వర్గీకరణ మాత్రమే అంతిమ పరిష్కారం కాదు, అత్యంత వెనుకబడిన వర్గాలకు వర్గీకరణ ఒక ఉపశమనం మాత్రమే అన్నారు. ఎస్సీ కులాల గ్రూపులపై కొందిరికి అనుమానాలు ఉన్నాయి.