07-02-2025 08:56:05 PM
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో గత గురువారం ఉపాధి పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు, బండరాళ్లు కూలి మృతి చెందిన తల్లీకూతుర్లు కాందారపు సరోజన, అన్నాజి మమత కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు మంచి చదువు అందేలా చూస్తామన్నారు. ఇదే ప్రమాదంలో గాయపడిన ఇంద్రాల రేణుక, వలబోజు మనెమ్మ ఇండ్లకు వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి మంచి వైద్యం అందించాలని సూచించారు.