అల్లోం అప్పయ్య సేవలను కొనియాడిన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి) : ములుగు జిల్లా డీఎం హెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్యను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి వెళ్లి గిరిజనులకు స్వయంగా వైద్య సేవలు అందించినందుకు మెచ్చుకున్నారు. కొండలు ఎక్కి, వాగులు దాటి ఆదివాసీలకు అందిస్తున్న వైద్య సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల నిర్మూలనకు వైద్య సిబ్బం ది నిరంతరం కృషి చేయాలన్నారు. ములుగు డీఎంహెచ్‌వోను ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లాల్లోని అన్ని గ్రామీణ, గిరిజన తండాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.