10-02-2025 09:07:18 PM
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణములోని స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఎండి నూరజ్, ధబ్బిడ శంకర్, తాజ్, యశ్వంత్ లు తేనే టిగల దాడిలో (తేనె టీగలు కుట్టగా) గాయపడ్డారు. స్థానిక మంథని ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు సోమవారం పరామర్శించి, వైద్యులుని అడిగి వారి పరిస్థితి తెలుసుకున్నారు. వారికి తీవ గాయాలయ్యాయి అని తెలుపగా వెంటనే వారిని మెరుగైన వైద్యం కోసం గోదావరిఖని ప్రభుత్వం హాస్పిటల్ కి రిఫర్ చేశారు. గోదావరిఖని హాస్పిటల్ వైద్యులతో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని శ్రీను బాబు సూచించారు.