calender_icon.png 20 September, 2024 | 9:01 PM

గత పదేళ్లలో సాగునీటీ సమస్య ఏ మాత్రం తీరలేదు

27-07-2024 09:25:13 PM

హైదరాబాద్: సాగునీటి సమస్య తీరాలనే పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత పదేళ్లలో సాగునీటీ సమస్య ఏ మాత్రం తీరలేదని, రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మిస్తే.. నిరుపయోగమైందని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద వచ్చిన నీరు వచ్చినట్లే పోతుంది, నిల్వ చేయాల్సిన పరిస్థితి ఉందని, రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కొత్తగా లక్ష ఎకరాలకు నీరు అందలేదని భట్టి మండిపడ్డారు.

మేం ప్రాధాన్యత వారీగా సాగునీటి ప్రాజెక్టులను మేం పూర్తి చేస్తామని, తక్కువ ఖర్చుతో పూర్తయ్యి నీరు వచ్చే ప్రాజెక్టులను ముందు పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎస్బీసీ టన్నెల్ ను పదేళ్ల పాటు పట్టించుకోలేదని, అది టన్నెల్ ను పూర్తి చేసి ఉంటే.. నల్గొండ జిల్లాకు నీరు అందేదని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు లేవని, మా ప్రభుత్వం  వచ్చిన ఆర్ నెలలోనే 16 వేల మంది టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించిందన్నారు.