హైదరాబాద్ : ఏం సాధించారని కాంగ్రెస్ సంబురాలు చేసుకుంటుంది? అని కేంద్ర హోంశాఖ సహయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంట రుణమాఫీని గురువారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనునుంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధిలు రైతు వేదికల వద్ద రుణమాఫీ సంబురాలు జరిపించాలని చెప్పారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రబీ, ఖరీఫ్ లో రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా?, రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా?, నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా? అని ఆయన ఎద్దెవా చేశారు. స్థానిక సంస్థలో ఎన్నికల లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా అని బండి ఆరోపించారు.