calender_icon.png 8 February, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో బీజేపీ గెలుపు ముందే ఊహించా: బండి సంజయ్

08-02-2025 12:58:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) అధికారం దిశగా దూసుకుపోతుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానంలో బీజేపీ 36 చోట్ల ఆధిక్యలో ఉండగా.. 12 స్థానంలో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) 18 చోట్ల ఆధిక్యంలో కనిపించగా, 4 స్థానల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి కోల్పోయింది.  ఎన్నికల కౌంటింగ్ బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు ముందే ఉహించిందేనన్నారు.

ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చీపురును ఛీ కొట్టి ఊడ్చేశారన్నారు. అలాగే చేతిని చిదిమేసి కమలాన్ని వికసింపజేశారు అని బండి సంజయ్ తన సంతోషాన్ని ఎక్స్ వేధికగా పంచుకున్నారు. ఢిల్లీ ప్రజలు అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలను వద్దులుకొని ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోరుకున్నారని ఆయన స్పష్టం చేశారు. దీంతో మేధావి వర్గం మొత్తం బీజేపీకే ఓటు వేసిందని పేర్కొన్నారు. అలాగే త్వరలో తెలంగాణ లో జరుగనున్న మూడు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. శాసన సభలో ప్రజల తరుపున అధికార పార్టీని ప్రశ్నించేది బీజేపీయే అని, రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.