calender_icon.png 13 April, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేమంతా ఒకటే.. మా మధ్య విబేధాల్లేవు: బండి సంజయ్

12-04-2025 08:55:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్రం మంత్రి బండి సంజయ్ శనివారం ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిశారు. ఇద్దరు కలిసి ఆకాశపురి హనుమాన్ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇద్దరు ఆకాశపురి హనుమాన్ గుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తో కాసేపు ముచ్చటించిన బండి సంజయ్ చాయ్ తాగారు. ఈ మధ్య పార్టీ నేతలపై ఫైర్ అయిన రాజాసింగ్ దగ్గరకు ఇవాళ బండి వెళ్లడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... మేమంతా ఒకటే.. మా మధ్య విబేధాల్లేవు అని పేర్కొన్నారు. హిందూ సమాజ సంఘటితం కోసం పోరాడే నేత రాజాసింగ్ అన్నారు. హెచ్‌సీయూ భూముల బ్రోకర్ ఎవరో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ భూముల అవినీతి ఆధారాలను బయటపెట్టే ధైర్యం కేటీఆర్ కు లేదా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు.