calender_icon.png 18 January, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు : మంత్రి మేఘ్వాల్

17-12-2024 03:19:03 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మంగళవారం ప్రవేశపెట్టారు. దీంతో జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టేందుకు లోకసభ ఆమోదించింది.  దీంతో రాష్ట్రాల హక్కులను కేంద్రం లాగేసుకుంటోందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. సభలో విపక్ష ఎంపీల ఆరోపణలపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమఖ్య స్ఫూర్తికి ఈ బిల్లు వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదని, 1983 నుంచి జమిలి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉందని మేఘ్వాల్ గుర్తు చేశారు. బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని, స్వీడన్, జర్మనీలో జమిలి ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. కేంద్రం జమిలి బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. కొన్ని విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించడంతో వారి కోరిక మేరకు స్పీకర్ ఓం బిర్లా బిల్లులపై హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఎలక్ట్రానిక్, బ్యాలెట్ విధానంలో ఓటింగ్ పెట్టారు. మెజార్టీ ఎంపీలు బిల్లులు ప్రవేశపెట్టేందుకు మద్దతు తెలిపాయి. జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి.