మునుగోడు,(విజయక్రాంతి): పార్లమెంట్ లో అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన తన వాక్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ మాల మహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు అన్నారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, బేశరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మను ధర్మాన్ని ముందువేసి భారతదేశ ప్రజలను అంబేద్కర్ వాదులను, భారత రాజ్యంగాన్ని అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను మండల మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అంతకుముందు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పీవీ రావు 19వ వర్ధంతి సందర్బంగా మండల కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బోగరి విజయకుమార్, మండల అధ్యక్షులు చలిచీమల యాదగిరి, ఈద శరత్ బాబు, బెల్లం బాల శివరాజు, పెరుమళ్ళ ప్రమోద్, జంగిలి నాగరాజు, రెడ్డి మల్ల యాదగిరి, రెడ్డి మల్ల వెంకట్, బేరి రవీందర్, పెరుమాండ్ల ప్రణయ్, పెరుమాండ్ల రామలింగయ్య, చింతపల్లి రామ లింగయ్య, చింతపల్లి అనిల్, ఈద లింగస్వామి, ముచ్చపోతుల భరత్, బెల్లం ప్రసాద్, నీరుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.