అందెశ్రీ ఘాట్‌ను సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
పాల్గొన్న కలెక్టర్ మను చౌదరి
ఘట్ కేసర్, జూన్ 9 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రజల గుండెల్లో ‘జయ జయహే తెలంగాణ‘ గేయంతో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజాకవి స్వర్గీయ అందెశ్రీ ఘాట్ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి అధికారికంగా సందర్శించారు. ఘట్ కేసర్ పట్టణంలోనిఅందెశ్రీ స్మారక ఘాట్ను పర్యాటక ప్రాంతంగా రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.
ఘాట్ పరిసరాల్లో మౌలిక వసతుల కల్పన, ల్యాండ్స్కేపింగ్, సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం చేయాలని కలెక్టర్ మను చౌదరిని మంత్రి ఆదేశించారు. ఈకార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం, ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, ఆర్డీవో, తహసిల్దార్ చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి కడపోల్ల మల్లేష్, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.






