01-03-2025 09:09:54 PM
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్...
కాగజ్ నగర్ (విజయక్రాంతి): మహాత్మ గాంధీ ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని కోసిని గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను సందర్శించి కూలీలతో మాట్లాడారు. కూలీలకు రోజుకు 600 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సకాలంలో డబ్బులు రాక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పనిచోట మెడికల్ కిట్లు, టెంట్లు, మంచినీటి సదుపాయం కల్పించాలని అన్నారు. ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఉపాధి కూలీల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.