ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జంగయ్య అధ్యక్షతన నిర్వహించిన కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్రశిక్ష ఉద్యోగుల టైమ్ స్కేల్ సాధన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం చేయాలని సదస్సు తీర్మానించిందని తెలిపారు. దీనికి సంబంధించిన నోటీసును విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు అందజేసినట్లు యూటీఎఫ్ నాయకులు జంగయ్య, రవి ఒక ప్రకటనలో తెలిపారు.