calender_icon.png 1 March, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల జీవో విడుదల చేయాలి

01-03-2025 08:17:52 PM

ఏఐటీయూసీ డిమాండ్

బూర్గంపాడు,(విజయక్రాంతి): కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల జీవోను విడుదల చేయాలని ఏటియుసి రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు(AITUC State Secretary Singu Narasimha Rao), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కెవి రావు(Bhadradri Kothagudem District Working President KV Rao)లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బూర్గంపాడు లక్ష్మీపురం ఫిమాకెమ్ కంపెనీ కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం గడ్డం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ..... రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను 2012 నాటి జీవో నెంబర్ 11 ప్రకారం వీడిఏ కలిపి చెల్లిస్తున్నారు. 15 సంవత్సరాల కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు అనేక రేట్లు పెరిగాయని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అన్ స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26,000/లు తగ్గకుండా ఆపై క్యాడర్లకు అంతకంటే ఎక్కువగా నిర్ణయించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కనీస వేతనాలు జీవోలు సాధించేందుకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కార్మిక వర్గానికి మొండి చేయి చూపిందని బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకే రాయితీలు కల్పించారని పేదల పొట్టలు కొట్టి పెద్దల బొజ్జలు నింపుతున్నారని విమర్శించారు. బిజెపి మోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఇందు కొరకు కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బిజెపి పాలనలో సంపన్నులు మరింత సంపన్నులుగాను పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. రూపాయి విలువ పడిపోయి నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగాయని దేశంలో 100 కోట్ల ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని సర్వే సంస్థలు వెల్లడించాయని అన్నారు. బిజెపి మత రాజకీయాలు చేస్తూ తక్షణ ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చుతుందని విమర్శించారు. కార్మిక వర్గం అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బర్ల వెంకటేశ్వర్లు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.