26-02-2025 02:47:23 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): మిర్చికి కనీసం మద్దతు ధర(Support Price)ను రూ.25 వేలు గా కేటాయించి ఇవ్వాలని సీపీఎం ఇల్లందు మండల కార్యదర్శి వర్గ సభ్యులు తాళ్లూరి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఇల్లందు మండలం కొమరారం, మాణిక్యారం గ్రామాల్లో మిర్చి కల్లాలను బుధవారం సందర్శించి రైతులను ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మిర్చి రేటు దారుణంగా పడిపోవడంతో పెట్టిన పెట్టు బడి కూడా రాకపోవడం చాలా భాదగా ఉందని రైతులు వాపోయారన్నారు.
మద్దతు ధర లేకపోవడం వలన రైతులు ఆత్మహత్యల(Farmers Commit Suicide)కు పాల్పడే ప్రమాదం ఉందని కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి మిర్చి ధరను పెంచాలని డిమాండ్ చేశారు. ఎకరానికి లక్ష రూపాయలు పై గానే పురుగు మందులు, కూలీలు ఇతరాత్ర ఖర్చులు కలిపి పెట్టు బడి పెట్టారని కనీసం కూలిల ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులను ఆదుకునే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వజ్జా సురేష్, రైతులు ధరవత్ పాపా, భూక్యా వీరు, బుజ్జి, సరోజ, నాగమణి, వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.