calender_icon.png 20 April, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనీస పెన్షన్ రూ.5 వేలకు పెంచాలి

19-04-2025 12:00:00 AM

బీఎంఎస్ జాతీయ నాయకులు లక్ష్మారెడ్డి

1౦౦% ఆన్‌లైన్ పద్ధతి అమలు అయ్యేలా చూడాలి

మంచిర్యాల, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : కనీస పెన్షన్ ను రూ.5 వేలకు పెంచాలని, ఎఫ్ పీ ఎస్ 1971 పింఛను దారులకు ప్రస్తుతమున్న రూ. 1000 కనీస పెన్షన్ ఇవ్వాలని బీఎంఎస్ జాతీయ నాయకులు, సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డ్ సభ్యులు కొత్త కాపు లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ విక్రమ్ దేవ్‌దత్ అధ్యక్షతన జరిగిన కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ట్రస్టీ (బీఓటీ) 184వ సమావేశంలో ఆయన మాట్లాడారు.

కార్మికులకు కనీస పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీ ఎఫ్) లో పెట్టుబడుల శాతాన్ని 7 నుంచి 10 వర కు పెంచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సీఎంపీఎఫ్ ప్రధాన కార్యాలయం లో కూడా పెట్టుబడులను అజమాయిషీ చేసే యంత్రాంగం కూడా ఉండాలని సూచించారు.

నూటికి నూరు శాతం ఆన్ లైన్ పద్ధతి అమలు అయ్యేటట్లు చూడాలని కోరారు. వచ్చే మే నెలాఖరు వరకు పూర్తయ్యేటట్లు చూస్తామని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి  చెప్పారన్నారు. కోలిండియా నిర్ణయించినట్లు సింగరేణి యాజమాన్యం కూడా పెన్షన్ ఫండ్‌లో ప్రతి టన్ను బొగ్గు పైన రూ. 20 జమచేయాలని బోర్డు సభ్యులందరూ సూచించగా, సింగరేణి సీఎండి బలరాం నాయక్ అంగీకరించారని  తెలిపా రు.

ఈ సమావేశంలో కోల్‌మైన్స్ ప్రావిడెం ట్ ఫండ్ కమిషనర్ విజయ్ కుమార్ మిశ్రా, అదనపు కార్యదర్శి రూహిధర్ బ్రార్, ఆర్థిక సలహాదారు నిరుపమ కొట్రు, డిడిజి సంతో ష్, బిఎంఎస్ ప్రతినిధి, ట్రస్టీ బోర్డ్ సభ్యులు ఆశిష్ మూర్తి, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారని వెల్లడించారు.