calender_icon.png 2 February, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మశాన వాటికల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి

28-01-2025 11:15:52 PM

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు...

కూకట్ పల్లి (విజయక్రాంతి): స్మశానవాటికలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని చరబండ రాజు కాలనీ, వినాయక నగర్ కాలనీలో ఉన్న స్మశాన వాటిక లను డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. మనిషి చివరి మజిలీ అయిన స్మశాన వాటికలో సదుపాయాలు లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. నీటి సదుపాయం లేక స్మశాన వాటికలో పిచ్చి మొక్కలు ఎపుగా పెరిగి దోమలకు ఆవాసాలుగా మారాయన్నారు. దోమలు వృద్ధి చెంది స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఎమ్మెల్యే అధికారులతో పేర్కొన్నారు.

వీలైనంత త్వరగా స్మశానవాటికకు కాంపౌండ్ వాల్ నిర్మించి, నీటి సదుపాయం కల్పించి మూత్రశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా వినాయక నగర్ లోని స్మశాన వాటికను పరిశీలించిన అనంతరం అక్కడ మౌలిక వసతులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలానగర్ లోని నాలా పరిసర ప్రాంతాల కాలనీలు, బస్తీలలో దోమలు విజృంభిస్తున్నాయని  అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకొని ఫాగింగ్ క్రమం తప్పకుండా చేయాలని కోరారు.