calender_icon.png 8 April, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు కనీస సౌకర్యాలు కల్పించాలి

08-04-2025 01:10:00 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్

ముషీరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): డబుల్ బెడ్ రూం ఇండ్లు పొందిన లబ్ధిదారుల ఆయా భవనాలకు మంచినీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముషీరాబాద్ నియోజక వర్గానికి  చెందిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు షామీర్పేటలో నిర్మించి ఇచ్చిన భవనాలలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇచ్చా రు తప్ప, ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు.

పేద ప్రజలు అద్దె ఇళ్లలో కిరాయిలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద ప్రజల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో షామీర్పేట డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీరేందర్, ద్వార కానంద్, నాయకులు విశ్వనాథ్, మల్లేష్, వెంకటేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.