calender_icon.png 11 March, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

11-03-2025 12:06:18 AM

మఠంపల్లి, మార్చి 10 : మఠంపల్లి మండలంలోని గ్రామ పంచాయతీలో రాష్ర్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకంలో నిరుపేదలైన ఉపాధి కూలీలుగా పని చేస్తూన్నా వారికి కనీస మౌలిక సదుపాయాలు, కూలీ వేతనం కల్పించాలని, కొలతలతో సంబంధం లేకుండా దినసరి కూలి ఇవ్వాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ప్రభుత్వమే పంపిణీ చేయాలని, పని ప్రదేశాలలో టెంట్, నీటి వసతులు కల్పించాలని మఠంపల్లి ఎంపీడీఓ జగదీష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు నందిపాటి సోమయ్య, ఆరాల నాగరాజు, వీరస్వామి పాల్గొన్నారు.