హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (విజయక్రాంతి): మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి అత్యాధునిక గుండె చికిత్సలో 100 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలను విజ నిర్వహించి ముందు వరుస నిలిచింది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో 100 మంది పేషెంట్లను ఆహ్వానించి, వారి అనుభవాలను శుక్రవారం మీడియాకు వివరించారు.
కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డా. మాట్లాడుతూ.. మల్లారెడ్డి నారయణ హస్పిటల్‌లో గడిచిన 10నెలల కా 100 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. మరో 3 నెలల్లో రోబోటిక్ సర్జరీలతో అతి తక్కువ టైంలో మెరుగైన సర్జరీలు చేసి పేషెంట్లు అతి తక్కువ సమయంలో కొలుకునేలా ఆధునాతన మెషినరీలను ఎ చేస్తున్నామని అన్నారు.
డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆధునిక విధానం ద్వారా ఛాతి ఎముకను కోయకుండానే మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ చేయడం జరుగుతుందన్నారు. డాక్టర్ హరీష్, సిబ్బంది , పేషెంట్లు పాల్గొన్నారు.