10 మందికి గాయాలు
ఖమ్మం, నవంబర్ 19 (విజయక్రాంతి): సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవర్ మినీ వ్యాన్ను నడపడంతో 10 మంది కూలీలకు గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నరసరావుపేట వద్ద మంగళవారం చోటు చేసుకుంది. మండలం లోని కొర్లగూడెం గ్రామానికి చెందిన 28 మంది కూలీలు మినీ వ్యానులో ఏన్కూరు మండలం కేసుపల్లిలోని ఓ రైతు పొలంలో పత్తి తీసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపడంతో ముందుగా వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.