04-03-2025 07:17:39 PM
పిఎంశ్రీ నిధులను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలి..
సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్..
మంచిర్యాల (విజయక్రాంతి): మినీ టీచర్లకు మెయిన్ టీచర్ల జీతం చెల్లించాలని, పిఎంశ్రీ నిధులను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలో అంగన్వాడీ యూనియన్ (సీఐటీయు) జిల్లా అధ్యక్షురాలు భానుమతి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. పదేపదే ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారించకుండా అక్రమ అరెస్టులతో ఉద్యోగులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. పీఎం శ్రీ నిధులను అంగన్వాడి కేంద్రాలకు కేటాయించాలని, ఎన్ఈపిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మినీ నుంచి మేయిన్ ఐనా టీచర్లకు మినీ జీతం మాత్రమే చెల్లిస్తున్నారని, పది నెలలుగా మినీ టీచర్లకు మేయిన్ వేతనం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం అంగన్వాడి యూనియన్( సిఐటియు ) రాష్ట్ర కమిటీ హైదరాబాద్ ప్రజా భవన్ కు పిలుపునివ్వగా జిల్లాలో ఉన్న అంగన్వాడి ఉద్యోగులను సోమ వారం అర్ధరాత్రి నుంచి జిల్లా మొత్తంగా అంగన్వాడి ఉద్యోగులను అక్రమంగా అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఈ అక్రమ అరెస్టులను సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి మహేశ్వరి, జిల్లా నాయకులు పద్మ, సరిత, అనురాధ, సబిత తదితరులు పాల్గొన్నారు.