calender_icon.png 8 January, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురికి కూపంగా మినీ ట్యాంక్ బండ్

07-01-2025 12:00:00 AM

  • అలంకార ప్రాయంగా బోటింగ్

చెరువంతా గుర్రపు డెక్క తీగ 

ప్రజాధనం దుర్వినియోగం

అసాంఘిక కలాపాలకు అడ్డా

కోరుట్ల, జనవరి 6: జగిత్యాల జిల్లా కోరు ట్ల పట్టణంలోని మద్దుల చెరువును ప్రజలకు ఆహ్లదం పంచేందుకు, పర్యాటక కేంద్రంగా మినీ ట్యాంక్ బండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మిని ట్యాంక్ బండ్’గా ఏర్పాటు చేసిన మద్దుల చెరువులో పర్యాటకులకు ఆహ్లదం పంచేందుకు రెండు బోటింగ్ పడవలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో అప్పటి కలెక్టర్ యాస్మిన్ బాషా, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావులు  బోటింగ్ పడవలను  ప్రారంభించి పర్యా టకులకు, స్థానికులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. దీంతో యేండ్ల కాలం నుం డి వేచి చూసిన  పట్టణ ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.

కానీ ఇదంతా మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రారంభించిన బోటింగ్ పడవలు కొద్ది రోజు లు నడిచి మూలన పడ్డాయి. దీంతో మీని ట్యాంక్ బండ్ మద్దుల చెరువులో బోటింగ్ పట్టణ ప్రజలకు, పర్యాటకులకు అందని ద్రాక్షగా మారింది. 

నిరుపయోగం.. కొరవడిన పరిశుభ్రత

మద్దుల చెరువును మినీ టాంక్ బండ్’గా ఏర్పాటు చేసేందుకు గాను సుమారు రూ. 3 కోట్లకు పైగా ప్రభుత్వం నిధులు వెచ్చించిం ది. మద్దుల చెరువు కట్టపై పట్టణ ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లదం పంచె విధంగా ధ్యాన మందిరం, పర్యాటకులు కూర్చునేం దుకు విశ్రాంతి గది, ఫౌంటెన్ , బతుకమ్మ ఘాట్  ఆకర్షణీయమైన అందమైన రంగుల తో సుందరంగా నిర్మించారు.

కానీ అవన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారి కళావిహీ నంగా మారాయి. రంగులు వెలిసి చెత్తాచెదా రంతో నిండి నిండిపోయాయి. చెరువు కట్ట పై రోడ్లు నెర్రలు వేసి పగిలిపోయి  డామేజ్ అయింది.

చెరువు కట్టకు ఇరువైపులా ఇనుప రైలింగ్ ఏర్పాటు చేశారు. కోట్ల నిధులు వె చ్చించి నిర్మించిన మద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ నిరుపయోగంగా  మారడం  ప్రజల్లో నిరాశ మిగిల్చింది. ఇనుప రైలింగ్‌ను అంటుకుని పిచ్చి మొక్కలు పెరిగి, రాకపోక లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పెరిగిన పిచ్చి మొక్కలు సేద తీరుదామని వచ్చే వారి కి ఇబ్బందిగా మారాయి. ఈ పిచ్చి మొక్కలు తొలగించి మద్దుల చెరువు కట్టపై  బల్దియా అధికారులు  పారిశుధ్య పనులు చేపడితే సుందరంగా మారుతుంది. 

చెరువు అంతా గుర్రపు డెక్క 

మద్దుల చెరువులో పెరిగిన పిచ్చి మొక్క లతో పాటూ గుర్రపు డెక్క తీగ తొలగించ డానికి గతంలో మున్సిపల్ కౌన్సిల్ ఆమో దంతో రూ. 14 లక్షలు కేటాయించారు. కానీ  పూర్తిస్థాయిలో తొలగించక పోవడంతో, ఈ జాతి మొక్క నీటిపై మళ్ళీ పెరిగి చెరువు అంతా విస్తరించింది.

గుర్రపు డెక్క మొక్క ఆనవాళ్లు లేకుండా తొలగించాలి. కానీ తూతూ మంత్రంగా పైపైనే తొలగించారని, వేర్లను వదిలేయడంతో తొలగించిన గుర్రపు డెక్క మొక్కలు మళ్ళీ చెరువులో నీటిపై విస్తరించి చెరువు మొత్తం వ్యాపించింది. పర్యాటక కేంద్రం కాస్త పిచ్చి మొక్కలతో నిండి పోయి మురికి కూపంగా తయారైంది.

పని చేయని విద్యుత్  లైటింగ్

ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన సమయం లో చెరువు కట్టపై హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసారు. కొద్ది రోజుల తర్వాత లైట్లు పనిచే యక పోవడంతో చీకటి పడ్డ సమయంలో ట్యాంకు బండ్ పూర్తిగా అంధకారం నెలకొం టున్నది.  విద్యుత్తు స్థంబాలు లైట్లు పగిలిన ట్లు దర్శనమిస్తాయి. హైమాస్ట్ లైట్లను బాగు చేయాలనీ, కొత్త స్థంబాలు ఏర్పాటు చేయా లని ప్రజలు, పర్యాటకులు కోరుతున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

చీకటి పడితే చాలు  గుంపులుగా యువ కులు ట్యాంక్ బండ్’పై అడ్డాలు వేస్తూ గంజా యి, మద్యం, జూదం కేంద్రంగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఎటు చూసినా మద్యం సీసాలు, సిగరేట్ పీకలు, గుట్కా ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. సేద తీరుదామని ఎవరైనా వస్తే ఉన్న సిమెంట్ బెంచీలూ విరిగి పోయా యి.

అసాంఘిక కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయని  మత్తులో ఉన్న వారే ఇక్కడ అధికంగా కనిపిస్తారని సమీపంలోని కాలనీ వాసులు అంటున్నారు. సాయంకా లం మద్దుల చెరువు పక్కన గల కాలనీ వా సులు ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి జంకు తున్నారు. పోలీసులు నిత్యం రాత్రి వేళలో పెట్రోలింగ్ చేస్తే, తాగుబోతుల అల్లరి అరికట్టవచ్చని స్థానికులు కోరుతున్నారు. 

ఇప్పటికైనా సంబంధింత అధికారులు చొరవ చూపి మినీ ట్యాంకు బండ్’పై నెల కొన్న సమస్యలు పరిష్కరించి, గుర్రపు డెక్క ను తొలగించి, బోటింగ్ వినియోగంలోకి తీసుకువస్తే బాగుంటుంది.