calender_icon.png 13 February, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడులో ప్రారంభమైన మినీ సమ్మక్క-సారలమ్మ జాతర

13-02-2025 04:31:22 PM

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామంలో మహావైభవంగా మినీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. ఆదివాసీ పూజా క్రతువులు, వడ్డెలు, కత్తి రాము, ఇర్ప రామలక్ష్మి, పెనక భాస్కర్, గణిక సంధ్యన, పూజారులతో ఆదివాసి గిరిజన ఆచార సంప్రదాయాల ప్రకారం.. పుట్ట మన్ను డప్పు మేళాలతో గద్దెల వద్దకు చేర్చి  బుధవారం పూజలు నిర్వహించారు. సాయంత్రం సారలమ్మ తల్లిని మేళాల చప్పుడులతో గద్దెపైకి చేరుకుంది. గురువారం తెల్లవారుజామున సమ్మక్క గద్దెపైకి తీసుకొచ్చి పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నదానం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు వన దేవతల దర్శనం అనంతరం.. శనివారం తల్లుల వన ప్రవేశం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. జాతర కోసం టేకులపల్లి మండలం బోడు గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు గ్రామ పెద్దలు, దొర, పటేల్, యువకులు, పిల్లలు, భక్తులు, పూజార్లు, పాల్గొన్నారు. పరిసర గ్రామాలైన  పాతలగడ్డ, మురుట్ల, రామచంద్ర పేట, కొప్పురాయి, ఒడ్డుగూడెం, లక్య తండా, ఎర్రాయి గూడెం తదితర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.