calender_icon.png 11 February, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి మినీ మేడారం జాతర

11-02-2025 12:00:00 AM

  1. ఏర్పాట్లలో సింగరేణి బిజీ
  2. ముస్తాబైన సమ్మక్క- సారలమ్మ గుడి

మణుగూరు, ఫిబ్రవరి10 (విజయక్రాం తి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని తోగూడెం గ్రామంలో మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచి న సమ్మక్క- సారలమ్మ సుంకు జాతర మంగళ వారం నుండి ప్రారంభం కానుంది.  జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుం డా ఉండేందుకు సింగరేణి కాలరీస్ మణు గూరు ఏరియా యాజమాన్యం ఆధ్వర్యం లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆలయం చుట్టూ ఫెన్సింగ్, బారికేడ్లు, విద్యుత్ దీపాలు, మంచినీటి వస తి, ఆలయ పరిసరాల పరిశుభ్రం చేయటం లాంటి పనుల నిర్వహణలో సింగరేణి అధి కారులు బిజీగా ఉన్నారు. జాతరను పురస్క రించుకొని ఆలయ కమిటీ సభ్యులు ఆల యాన్ని ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల తో అలంకరిస్తున్నారు. జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఖమ్మం పరిసర ప్రాంత జిల్లాల భక్తులు కూడా అమ్మవార్లను మొక్కులు తీర్చుకోనున్నారు.

నేడు మండ మెలుగుట..

మణుగూరులో గూడెం సమ్మక్క- సారల మ్మ ఆలయంలో మంగళవారం మండే మెలుగుట కార్యక్రమంతో సుంకు జాతర ప్రారంభం కానుంది. 12వ తేదీ బుధవా రం సారాలమ్మ దేవతను సమీపంలోని రధం గుట్ట నుంచి ఆలయం వద్దనున్న గద్దె పైకి తీసుకురానున్నారు. 13వ తేదీ గురువారంన సమ్మక్క తల్లిని అదే రథం గుట్ట నుంచి తీసుకువచ్చి గద్దెలపై కూర్చోబెట్ట నున్నారు.

14వ తేదీన సమ్మక్క- సారలమ్మలు గద్దలపై కూర్చొని ఉండగా నిండు జాతరను ఆదివాసులతోపాటు గిరిజనేతరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించు కుంటారు. 15వ తేదీ శుక్రవారం సమ్మక్క సారలమ్మల తల్లులను వన ప్రవేశం చేయించనున్నారు.