01-03-2025 01:16:01 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాం తి): మహిళల కోసం ప్రతి అసెంబ్లీ నియో జక వర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కును ఏ ర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇందు లో 10 శాతం ఇండస్ట్రియల్ పార్క్‌లను ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే దళితులు.. దళితులు అంటేనే కాంగ్రెస్ అని మంత్రి పేర్కొన్నారు.
దళితుల అభివృద్ధి కోస ం చిత్తశుద్ధితో కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. లక్డీకాపూల్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవన్ లో ‘రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎంఎస్‌ఎంఈ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ ప్రెజైస్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఏప్రిల్ మొదటి వారంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తమిళనాడు, కర్ణాటకలో పర్యటించి అక్కడి ప్రభుత్వాలు దళిత పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రో త్సాహకాలపై అధ్యయనం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆ బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా దళిత పారిశ్రామికవేత్తలకు మరిం త ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందన్నారు.
చేవెళ్ల డిక్లరేషన్‌లో దళితులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేరు స్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెడుతూనే సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి నట్టు వెల్లడించారు. 2017 నుంచి సబ్సిడీల కింద పారిశ్రామికవేత్తలకు అందాల్సిన బకాయిలు రూ.4,500 కోట్లకుపైగా ఉన్నాయన్నా రు. వీటిలో రూ.2,200 కోట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాము అధికారంలోకి రాగానే ఈ బకాయిల చెల్లింపులపై దృష్టి సారించినట్టు తెలిపారు. మార్చి చివరి నాటికి రూ.300 కోట్లు చెల్లించనున్నట్టు శ్రీధర్‌బాబు వెల్లడించారు. దేశంలో ఎక్కువ మంది కార్మికులు ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా పాలసీ లేదన్నారు. రాహు ల్ గాంధీ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసి తాము ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చినట్టు చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోరిక మేరకు వారికి మరింత ప్రయోజనం చేకూరేలా పాలసీ గైడ్‌లైన్స్‌ను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపనలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించనున్నట్టు తెలిపారు. స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య మున్న మానవ వనరులను అందించేందకు చర్యలు తీసుకుంటామన్నారు.
కొత్త ఆలోచనలతో ముందుకొ చ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బ్యాంకు రుణాలు పొందాటంలో ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించనున్నట్టు వెల్లడించారు.