23-03-2025 01:09:31 AM
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్‌లో మహిళలకు ప్రాధాన్యమిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ పార్కుల్లో మహిళా పారిశ్రామికవేత్తలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. మొదటి విడత కింద 20 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.
119 నియోజకవర్గాల్లో మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక ట్రైనింగ్ అకాడమీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు శ్రీధర్‌బాబు ప్రకటించారు. రాష్ట్రంలో తమ సర్కారు వచ్చేదాక ఎంఎస్‌ఎంఈ పాలసీలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని తీసుకొచ్చామన్నారు.
చిన్న పరిశ్రమలు పెద్ద ఇండస్ట్రీలుగా ఎదిగేందుకు సహకరిస్తామన్నారు. శనివారం అసెంబ్లీలో పారిశ్రామిక రంగంలో మహిళలకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, తోట లక్ష్మీకాంతారావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించడం అనేది చాలా కష్టమని, కానీ తాము అది సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేసారు.
తమకు పక్క రాష్ట్రాలు పోటీకాదన్నారు. అన్ని నియోజకవర్గాలు భాగస్వామ్యం అయినప్పుడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధన అనేది సాధ్యమవుతుందని మంత్రి వివరించారు. పెట్టబడులు పెట్టేందుకు వచ్చే పరిశ్రమలను అడ్డుకోవద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేసారు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు సంబంధిత మా ర్కెట్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఇందుకోసం ప్రత్యేక అధి కారిని నియమిస్తామన్నారు. సింగల్ మదర్లకు స్వయం సహాయ సంఘా ల ద్వారా ప్రభుత్వం చేయూతనందిస్తుందని చెప్పారు. ఫూచర్ సిటీలో మహిళా పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. కో టిమంది మహిళలను కోటీశ్వరుల ను చేయాలన్న లక్ష్యంతో తమ ప్ర భుత్వం ముందుకుపోతుందన్నారు.