12-04-2025 05:54:25 PM
కల్లూరు (విజయక్రాంతి): పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం నారాయణపురంలో ప్లాంట్ కి స్థలం కూడా ఇచ్చి అలాగే కొత్త నారాయణపురం గ్రామం కొత్త మినరల్ వాటర్ ప్లాంట్లు 15 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసి శనివారం వాటిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి ప్రసాద రెడ్డి ప్రారంభించినారు. గ్రామస్తులకు పరిశుభ్రమైన, పోషకాలు గల నీటిని అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని, పుట్టిన గడ్డకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని, కులమత బేధాలకు అతీతంగా ఉంటామని, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మా లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలోని సమస్యలు ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని పూర్తి చేపిస్తామని హామీ ఇచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో మా పాత్ర కచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, గ్రామ నాయకులు, మండల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.