కరీంనగర్, జనవరి 30 (విజయక్రాంతి): నీతి, జాతి లేని పార్టీ ఎంఐఎం పార్టీ అని, గత 30 సంవత్సరాలుగా ఏ పార్టీ అధికా రంలో ఉంటే ఆ పార్టీతో వంత పాడుతుం దని మాజీ మేయర్ వై సునీల్ రావు అన్నా రు.
గురువారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ నాయకులు కరీంనగర్ కు వచ్చి ఎంఐ ఎందే సూపర్ పవర్ అని ప్రగల్భాలు పలికా రని, బండి సంజయ్ కుమార్ ను అసెంబ్లీ లో అడుగుపెట్టనివ్వని దమ్ము మాకే ఉందని విర్ర వీగారని, తెలంగాణ లో బీజేపీ అధికా రంలోకి రాకుండా అడ్డుకున్నది అసదొద్దీన్ ఓవైసీనేనని తప్పుడు కూతలు కూశారని అ న్నారు.
1999 నుంచి ఇప్పటి వరకు ఓవైసీ కుటుంబం ఎంఐఎం పార్టీ తమ ఆస్తులను కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి రాజ కీయ ఎత్తుగడలు వేస్తూ అధికార పార్టీలతో అంటకాగుతుందన్నారు. ఎంఐఎం పార్టీని పెట్టింది ఒకప్పటి పాకిస్టాన్ ఏజెంట్ కాసీం రజ్వీ కాదా అని ప్రశ్నించారు, కాసీం రజ్వీ పాకిస్థాన్‌కు పోతుపోతు ఎంఐఎం నాయకు లకు అప్పగించారని, ఎంఐఎం పార్టీ దుర్మా ర్గాలు రజాకార్ సినిమా చూస్తే అర్ధమవు తుందన్నారు.
ఎంఐఎం పార్టీ నాయకులు కరీంనగర్ గడ్డమీద బండి సంజయ్ పై వ్యా ఖ్యలు చేయడం సిగ్గుచేటని, నిజమైన భారత మాత బిడ్డ బండి సంజయ్ కుమార్ అన్నా రు. మీరు చేసే కుట్రలు, కుతంత్రాలు కరీంన గర్ ప్రజల ముందు, బండి సంజయ్ కుమా ర్ ముందు ఏమాత్రం సాగవని అన్నారు. ద మ్ముంటే ఎంఐఎం పోటీచేసి ఓడించాలే త ప్ప ఏ పార్టీకో సపోర్ట్ చేసి సంజయ్న ఓడిం చామనడం పిరికిపంద చర్య అని అన్నారు.