calender_icon.png 24 November, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఐఎం చీఫ్‌కు మా అమ్మ శాపం తగిలింది

24-11-2024 01:33:02 AM

బీజేపీ నాయకురాలు మాధవీలత 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతదేశ ఐకమత్యానికి నిదర్శనంగా నిలిచాయని బీజేపీ నాయకురాలు మాధవీ లత పేర్కొన్నారు. ఎంఐఎం 16 స్థానా ల్లో పోటీ చేసీ 15 సీట్లలో ఓడిపోయిందని, ఎంఐఎం చీఫ్‌కు తన తల్లి కౌసల్య శాపం తగిలిందని ఆమె ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితా ల్లో మహాయుతి భారీ విజయం సాధించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ లు ముస్లీం లా బోర్డు, వక్ఫ్ బోర్డు లాంటి విషయాలు మాట్లాడి 130 కోట్ల మంది హైందవులను తమకు అక్కర్లేదని అనుకున్నారని అన్నారు. ఎంఐఎం అధినేత అసద్ ఎన్నికల ప్రచారంలో అల్లాకు భయపడాలి తప్పా మోదీకి భయపడాల్సిన అవసరం లేదంటూ ప్రచారం చేశారని మాధవీలత గుర్తుచేశారు.