calender_icon.png 10 October, 2024 | 10:43 AM

ఫ్లోరిడాలో ‘మిల్టన్’ బీభత్సం

10-10-2024 01:10:11 AM

230 మందికి పైగా మృతి.. 

వేలాదిగా కొట్టుకుపోయిన వాహనాలు

కుప్పకూలిన భవనాలు.. భయం గుప్పిట్లో ఐదు రాష్ట్రాల ప్రజలు

ఫ్లోరిడా, అక్టోబర్ 10: హెలెన్ హరికేన్ సృష్టించిన విలయాన్ని మరువకముందే  అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతం మరో ప్రకృ తి విపత్తును ఎదుర్కొంటున్నది. ఐదు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది పౌరులు, టూరిస్టులు భయం గుప్పిట్లోనే ఉన్నారు.

అక్కడి అధికారులు ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హరికేన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని విమానాశ్రయాలను మూసివేశారు. మొదట కేటగిరీ గా ప్రారంభమైన మిల్టన్ హరికేన్ క్రమంగా కేటగిరీ రూపాంతరం చెందింది. హరికేన్ ఫ్లోరిడా పశ్చిమ ప్రాంతం వైపు దూసుకెళ్తున్నది. బుధవారం అక్కడ గంటలకు 270 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచా యి.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలమైన గాలులు బీభత్సం సృష్టించాయి. వేలా ది ఇండ్లు కుప్పకూలాయి. రోడ్లపై వాహనా లు చెల్లాచెదురుగా పడిపోయాయి. హరికేన్ ధాటికి ఇప్పటివరకు నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేన్నస్సీ, వర్జీనియాలో సుమారు 230 మందికి పైగా పౌరులు మృతిచెందారు. రాత్రి వరకూ హరికేన్ ప్రభావం కొనసాగింది. రాత్రి సమ యంలో హరికేన్ తీరం దాటి వెళ్లిపోయింది.