26-02-2025 12:00:00 AM
నేటి ఆధునిక సమాజంలో ఏ దేశ చరిత్ర చూసినా ధనవంతులే పా లకవర్గంలో ఉంటున్నారు. నిరుపేదలు పా లితులుగానే ఉంటున్నారు. అది పెట్టుబడి దారీ వ్యవస్థతో కూడిన దేశమైనా, ప్ర జాస్వామ్య దేశమైనా, కమ్యూనిస్టు భావాలు కలిగిన దేశమైనా ఆఖరికి పాలకు లుగా కోటీశ్వరులే తమ అధిపత్యాన్ని చూపిస్తున్నారని సమకాలిన రాజకీయ పరిస్థితులను బట్టి నిరూపణ అవుతుంది. మొన్నటికి మొన్న ప్రపంచానికి పెద్దన్నగా పేరుగాంచిన అమెరికా దేశ ఎన్నికలను చూస్తే ప్రతి అభ్యర్థి కూడా లక్షల కోట్ల ధనం ఉన్న వ్యక్తులే పోటీ చేశారు.
నూతన అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ కోట్ల ధనం ఉ న్న బడా వ్యాపారవర్గం నుండి వచ్చిన వ్య క్తి కావడం గమనార్హం. ఇక అభివృద్ధిలో రెండో అతి పెద్ద దేశమైన చైనా పాలనా వ్య వస్థను పరిశీలిస్తే కమ్యూనిజం సిద్ధాంతం తో పాలన ఉన్నప్పటికీ లక్షల కోట్లు ఉన్న జిన్ పింగ్ అధ్యక్షుడిగా, సామాన్యులు పాలితులుగా ఉంటున్నారు. ఇక మరో అతి పెద్ద కమ్యూనిస్టు దేశమైన రష్యాను తీసుకుంటే అక్కడ కూడా లక్షల కోట్లు ఉన్న వ్లాదిమిన్ పుతిన్ ఎన్నో ఏండ్లుగా తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు.
భారత్‌లో అగ్రవర్ణ ఆధిపత్యం
ఇక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్ర జాస్వామ్య గణతంత్ర దేశమైన భారతదేశ రాజకీయాలను క్షుణ్ణంగా గమనిస్తే మన దేశంలో రెండు వైరుధ్యాలతో కూడిన పా లకులు చలామణి అవుతున్నారు. భారతీ య సామాజిక కుల వ్యవస్థలో జనాభాలో అత్యల్ప శాతం ఉన్న అగ్రవర్ణ సమాజం నుండి కోటీశ్వరులుగా ఉన్న వ్యక్తులే పా లకులు అవుతున్నారు. తాజాగా జరిగిన ఢి ల్లీ ఎన్నికల ప్రక్రియను గమనిస్తే పోటీ చే సిన అభ్యర్థులంతా కోట్ల ధనం ఉన్న వారే కావడం గమనార్హం. కానీ దేశం ఏమో ఉన్నతమైన విలువలతో కూడిన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. ప్రజాస్వామ్యం అనగా ఏంటి..? అమెరికామాజీ అధ్యక్షుడు అబ్ర హాం లింకన్ ప్రకారం ప్రజల కొరకు, ప్రజ ల చేత ప్రజలే ఎన్నుకునే వ్యవస్థని ప్రజా స్వామ్య దేశంగా భావిస్తారు. ఇక గణతంత్ర దేశం అనగా దేశ సమస్త సంపదలో, రాజ్యంలో, భూభాగంలో ప్రతి వ్యక్తికి సమాన వాటా పంపిణీ చేసుకునే విలువ లు కలిగిన రాజ్యం.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో ఏ దే శానికి లేని అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రాసి మనకు అందించారు. దేశంలో తరత రాలుగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అత్యల్ప శాతం ఉన్న అగ్రవర్ణాల చేత దోపిడీకి గురవుతు న్న 90శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలే రాజ్య సింహాసనం మీద కూర్చోవా లని, పాలకులు, నాయకులు కావాలని భా రత రాజ్యాంగ ఆత్మ తెలుపుతుంది. అందు కు నిదర్శనమే ధనవంతులైనా నిరుపేదలై నా వారికి కూడా సరిసమానంగా ఓటు ఉంటుంది. మరి అంబేద్కర్ భారత రా జ్యాంగం ఏమో సామాన్యులే సింహాసనం మీద కూర్చొని పాలించాలని చెప్తుంటే అం దుకు పూర్తి వ్యతిరేకంగా లక్షల కోట్లు ఉన్న భూస్వామ్య పెట్టుబడిదారీ ఆధిపత్య భావ జాలం ఉన్న వ్యక్తి పాలకుడైతే సామాన్యు లైన, తరతరాలుగా దోపిడీకి గురవుతున్న అత్యధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల మేలు కోరుతాడా? కోటీశ్వరుడైన పాలకు డు సామాన్యుల జీవితాలను గొప్పగా తీ ర్చిదిద్దకపోగా అదే సామాన్యులకు మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి దొరకకుండా నిరుపేదల్ని మరింత పేదరికంలోకి నెట్టివేసేలా ప్రణాళికలు రచిస్తాడు.
కులం ప్రభావం
భారతదేశంలో వర్గ బేధంకన్నా అన్ని తారతమ్యాలను అత్యధికంగా ప్రభావితం చేసేది కులం అనేది జగమెరిగిన సత్యం. మరి భారతదేశంలో రాజ్యం, సంపద, భూ మి సమస్త రంగాల్లో ఆధిపత్యం ఎవరిద నేది క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఎవరు అవునన్నా కాదన్నా లక్షల కోట్లు ఉన్న భూస్వామ్య పె ట్టుబడిదారి ఆధిపత్య భావజాలం ఉన్న అ గ్రవర్ణాలదే అనేది అనేక సర్వేల ప్రకారం నిరూపితమవుతోంది. దేశంలో రాష్ట్ర, కేం ద్ర ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులను పరి శీలిస్తే మెజార్టీగా కోట్లు ఉన్న అగ్రవర్ణాల వారే పోటీ చేస్తూ గెలుస్తున్నారు. అంబే ద్కర్ రాజ్యాంగ పుణ్యమా అని ఎస్సీ, ఎ స్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండబట్టి ఆ వర్గాలకు చెందిన కొందరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలువ గలుగుతున్నారు.
ఇక ఓబీసీలు సమాజంలో దాదాపు 60 శాతం ఉన్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం మూలంగా వారి జనాభా దా మాషా ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో తగిన వాటాను పొందలేకపోతున్నారు. స్వాతంత్ర పోరాటం ముందు నుండి తమి ళనాడు రాష్ట్రంలో పెరియార్ ఆత్మ గౌరవ, ద్రావిడ పోరాట ఫలితంగా అణ్ణాదురై, క రుణానిధి, ఆయన కొడుకు స్టాలిన్ నాయ కత్వంలో ఓబీసీలు సామాజికంగా, రాజకీ యంగా, సాంస్కృతికంగా చైతన్యం కలిగి ఉండడం మూలంగా నేడు ఆ రాష్ట్రంలో ఓబీసీలు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొం టూ తమ ప్రభావాన్ని చూపించగలుగుతు న్నారు.
అదేవిధంగా కేరళలో నారాయణ గురువు సమానత్వ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పోరాటం మూలంగా అక్కడ గౌడ కులస్తులు, దళితులు లక్షల కోట్లు ఉన్న అగ్రవర్ణాలకు దీటుగా రాజకీయాల్ని ప్రభావితం చేయగలుగుతున్నారు. ఇక కర్ణాటకలో బసవేశ్వరుడి సామాజిక, సాం స్కృతిక పోరాట ఫలితంగా లింగాయత్‌లు, గొల్ల కురుమలు రాజకీయాల్లో తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. మహారాష్ట్ర విషయానికి వస్తే సాహు మహారాజ్, జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పోరాట ఫలితంగా దళితులు, ఓబీసీలు రాజకీయాల్లో చైతన్యు లుగా ఉండి తమ ప్రభావాన్ని చూపించగ లుగుతున్నారు.
అదేవిధంగా ఉత్తరప్రదేశ్, బీహార్‌లో కాన్షీరాం, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ యాదవ్ చేసిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పోరాట ఫలితంగా నేడు దళిత కులానికి చెందిన మాయావతి, యాదవ కులానికి చెందిన అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తమ ప్రభావాన్ని చూపించ గలుగుతున్నారు.
అంటే కొందరు మహనీయుల త్యాగాల పోరాట ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో దళితులు ఓబీసీలు, రాజకీయాల్లో కొద్దిపాటి ప్రభావం చూపిస్తే మెజార్టీగా అనేక రాష్ట్రాల్లో కేంద్ర పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపించేది మాత్రం బడా భూస్వాములైన పెట్టుబడిదారులైన ఆధిపత్య భావజాలన్ని సమర్థిస్తూ అమలు చేసే అగ్రవర్ణాలే ఎక్కువ రాష్ట్రాల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపిస్తున్నారని నిరూపణ అవుతున్నది. ఇక్కడ అంతిమంగా నష్టపో తున్నది 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే. ఎందుకంటే నేటి ఆధునిక స మాజంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నే టికీ మౌలిక సదుపాయాలైన విద్య, వై ద్యం, ఉపాధి, ఇల్లు భూమి సంపూర్ణంగా దొరకకపోవడం మూలంగా సమస్త రంగా ల్లో 90శాతం వాటాను 10శాతం ఉన్న అగ్రవర్ణాలే అనుభవిస్తున్నారు.
అగ్రవర్ణాలను గద్దెనెక్కిస్తున్న బడుగులు
నేడు అగ్రవర్ణ పాలకులు అవలంబించే స్వార్థ విధానాల మూలంగా అనివార్యంగా ఇష్టం ఉన్నా లేకున్నా మెజార్టీ ప్రజలైన, ఓ టు బలమున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ ఓ ట్లు అమ్ముకొని అగ్రవర్ణ పాలకులను సిం హాసనం మీద కూర్చో పెడుతున్నారు. కానీ కోటీశ్వరులైన భూస్వాములైన పెట్టుబడి దారి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయొద్దని, సామాన్యులు నిరుపేదలే సింహాసనంపై కూర్చొని భారతదేశ పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం కావాలని పార్లమెంట్ ద్వా రా చట్టాలు తీసుకు వస్తే మాత్రం దేశ చరిత్రలో గొప్ప సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విప్లవమే సంభవిస్తుం ది.
కానీ అలాంటి విప్లవాన్ని నేటి ఆధునిక భారతీయ సమాజంలో చూడగలమా? 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు దేశ పా లనా వ్యవస్థలో మెజార్టీ శాతాన్ని పాలు పంచుకొన్నప్పుడే దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విప్లవం వచ్చేలా అత్యున్నత చట్టాలు రాగలవు. అప్పుడే దేశంలో సామాజిక అసమా నతలు పోయి భారత రాజ్యాంగ ఆత్మ చె ప్తున్న విధంగా ప్రజాస్వామ్య గణతంత్ర విలువలతో కూడిన మానవ అభివృద్ధి సూచీలో,అభివృద్ధిలో ముందుండే భారతదేశాన్ని చూడగలం.
వ్యాసకర్త సెల్: 9553041549
పుల్లెంల గణేష్