06-03-2025 12:00:00 AM
టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి
రామాయంపేట, మార్చి 5: గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేయాలని టియుజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని రామాయంపేటలో బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా యాదగిరి మాట్లాడుతూ... 2011 మార్చి 10న సీమాంధ్ర దోపిడీ పాలనపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తిన రోజు అని, తెలంగాణ ప్రజలు తెగించి తెగువతో పోరాడారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ అకాంక్షలను, ఉద్యమకారుల గోడును మాజీ సీఎం కెసిఆర్ విస్మరించి తెలంగాణను విధ్వంసం చేశాడని మండిపడ్డారు. ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ ఈనెల 10న హైదరాబాద్లోని ఇందిరా పార్కు నుండి ర్యాలీగా వెళ్ళి గన్పార్కు వద్ద అమరులకు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యమకారులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో టియుజేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, టిపిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పి రమేష్ గౌడ్, ఉద్యమకారుల జెఎసి ఎర్ర దుర్గం, పంబాల శ్రీనివాస్, జేఏసీ రాష్ట్ర నాయకులు తుల్జారెడ్డి, లక్ష్మి కాంతమ్మ, పి.లక్మీ, అన్వర్ పటేల్, టియూకేవి అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద యాదగిరి, డోలక్ యాదగిరి, గంగారాం, పి శ్రీనివాస్, నర్సగల్ల పెద్దస్వామి, చర్చల చంద్రన్న ప్రసాద్, కొమ్ము శంకర్, తాళ్లపల్లి ఎల్లం,కె రాజేంద్ర ప్రసాద్ తదితరులుపాల్గొన్నారు.