calender_icon.png 23 February, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీకి 21 మిలియన్ డాలర్లు!

23-02-2025 12:00:00 AM

  1. భారత్, బంగ్లాదేశ్ కోసం వేర్వేరుగా నిధులు
  2. వరుసగా మూడవ రోజు యూఎస్ ఎయిడ్‌పై అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: ఓటింగ్ శాతా న్ని పెంచడం కోసం భారత్‌లోని తన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోదీకి 21 మిలియన్ డాలర్లను ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాజాగా గవర్నర్ల వర్కింగ్ సెషన్‌లో పాల్గొన్న ట్రంప్..

వరుసగా మూడవ రోజు 21 మిలియన్ డాలర్ల నిధుల అంశాన్ని లేవనెత్తారు. యూ ఎస్ ఎయిడ్ ద్వారా భారత్, బంగ్లాదేశ్‌లకు వేర్వేరుగా నిధులు అందినట్టు స్పష్టం చేశా రు. ఈ క్రమంలోనే ట్రంప్ మొదటిసారిగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు.

‘ఓటింగ్ శాతం పెంచడం కోసం భారత్‌లోని నా స్నేహితుడు ప్రధాని నరేంద్రమోదీకి 21 మిలియన్ డాలర్లు వెళ్తున్నాయి. భారత్‌లో ఓటింగ్ శాతం పెంచడం కోసం మేము 21 మిలియన్ డాలర్లు ఇస్తున్నాం. మరి మా సంగతి ఏంటి? నాక్కూడా ఓటింగ్‌శాతం కావాలి’ అని పేర్కొన్నారు. 

విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ

ఓటింగ్ శాతం కోసం భారత్, బంగ్లాదేశ్‌కు వేర్వేరుగా నిధులు వెళ్లినట్టు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ విపక్షాలపై బీజేపీ నేత అమిత్ మాలవ్యా తీవ్ర విమర్శలు చేశారు. 21 మిలియన్ డాలర్లను కేవ లం బంగ్లాదేశ్‌కు మాత్రమే అమెరికా కేటాయించిందంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెలు వరించిన కథనాన్ని తప్పుబట్టారు.

అయితే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని   వాషింగ్టన్ పోస్ట్ సమర్థించింది. యూఎస్ ఎయిడ్ ఉ ద్యోగుల మాటల ఆధారంగా భారత్‌కు యూఎస్ ఎయిడ్ నుంచి నిధులు వెళ్లాయనడానికి  ఆధారాలు లేవని స్పష్టం చేసింది. 

మోదీ సమాధానం చెప్పాలి

తన స్నేహితుడు నరేంద్రమోదీకి ఓటింగ్‌శాతాన్ని పెంచడం కోసం 21 మిలియన్ డాలర్లు ఇచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే చెప్పినందున ఆ నిధులు ఎక్కడికి పోయాయన్న విషయాన్ని ప్రధాని మోదీనే చెప్పాలని డిమాండ్ చేసింది.

ఎన్నికలను ప్రభావి తం చేయడానికి డబ్బు ప్రధాని మోదీకి చేరిందనే విషయం ట్రంప్ ప్రకటన రుజువు చేస్తుందని పేర్కొంది. ఈ క్రమంలోనే వాషింగ్టన్ పోస్ట్ కథనంపై స్పందిం చిన కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా.. రాహుల్‌పై బీజేపీ, దాని అంధ మద్దతుదారులు చేసిన వ్యా ఖ్యలను వెనక్కి తీసు కోవాలని డిమాండ్ చేశారు.