- సేకరించిన ధాన్యం గోదాములకు తరలింపు
- సీఎంఆర్‌కు సిద్ధం కాకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు
- గడువులో గ్యారెంటీలు ఇచ్చి ధాన్యం తీసుకెళ్లాలని హెచ్చరిక
- పక్కరాష్ట్రాల మిల్లర్లతో ఒప్పందాలకు పౌరసరఫరాల శాఖ ప్లాన్
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ద్వారా పేద లకు సన్నబియ్యం పంపిణీ చేయాలని పెద్ద ఎత్తున ధాన్యం సేకరిస్తుంటే సీఎంఆర్‌కు మి ల్లర్లు సహకరించడం లేదు. గతంలో ధాన్యం తీసుకుని అప్పగించకపోవడంతో ఈసారి సీఎంఆర్ చేయాలంటే బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది.
గ్యారెంటీలు సమర్పించిన వెంటనే ధాన్యం కేటాయింపులు చేస్తామని పేర్కొంది. ధాన్యం సేకరణ నవంబర్ నుంచి ప్రారంభించి ఇప్పటివరకు 7,582 కేంద్రాల ద్వారా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. వీటిని సీఎంఆర్ చేసేందుకు మిల్లర్లకు కేటాయించి నెల రోజుల్లో ప్రభుత్వానికి బియ్యం అప్పగించాలి.
కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నమిల్లర్లలో 20 శాతం మిల్లర్లు కూడా ముందుకు రాలేదు. గ్యారెంటీలు లేకుండా ఇస్తే వెంటనే ధాన్యం తీసుకెళ్లి గడువులోగా ఇస్తామని మిల్లుల యాజమానులు అధికారులను కోరుతున్నారు.
గతంలో కూడా ఇదేవిధంగా ఒప్పందాలు చేసుకుని తీరా సమయానికి బియ్యం ఇవ్వకుండా రాజకీయ నాయకులతో ఒత్తిడిలు చేయించి కోట్లాది రూపాయల విలువైన ధాన్యం దొంగ చాటుగా అమ్ముకున్నారు.
పాత పద్ధతినే ఈసారి పాటిస్తే సన్నబియ్యం పేదలకు పంపిణీ చేయడం సాధ్యం కాదని, బ్యాంక్ గ్యారెంటీలు షరతులు పెడితే ఇచ్చిన ధాన్యం సీఎంఆర్ చేసి అప్పగిస్తారని, ఈసారి ఎలాంటి మినహాయింపులు లేవని పౌరసరఫరాల ఉన్నతా ధికారులు తేల్చి చెప్పారు.
మిల్లర్లు ధాన్యం తీసుకెళ్లకుంటే దాని ఎక్కడ భద్రపరిచి ఎప్పుడు సీఎంఆర్ చేయాలో తమకు పూర్తి గా తెలుసునని, మిల్లర్ల బెదిరింపులకు వెనకాడే ప్రసక్తిలేదని హెచ్చరించారు.
గోదాంలకు ధాన్యం తరలింపు..
ప్రభుత్వం సేకరించిన ధాన్యంలో ఇప్పటివరకు 10లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్ కోసం మిల్లులకు పంపారు. మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సమీప గోదాంల్లోకి తరలిస్తున్నారు. జిల్లాల్లో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వం గోదాంలను ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకుని బియ్యం భద్రపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు గతంలో ఎలాంటి బాకీ లు, ధాన్యం ఎగ్గొట్టకుండా ఉన్న మిల్లర్లకు వారి మిల్లు సామర్థ్యంలో 10శాతం బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చే విధంగా అవకాశం ఇచ్చా రు. దీంతో ఆయా మిల్లర్లు గ్యారెంటీలు సమర్పించి తమకు కేటాయించిన ధాన్యం బస్తాలను తీసుకెళ్లి సీఎంఆర్ చేస్తున్నారు.
బాకీలు, గత కొన్నేళ్లుగా రాజకీయ నాయకులతో అండతో ధాన్యం తీసుకుని ఎగొట్టిన మిల్లర్లకు 25 శాతం గ్యారెంటీ ఇవ్వాలని పేర్కొనడంతో వారు మిల్లింగ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. వారంతా త్వరగా తాము పెట్టిన నిబంధనలు అంగీకరించి సీఎంఆర్‌కు సిద్ధం కావాలని, కయ్యానికి కాలు దువ్వాలని అనుకుంటే వ్యాపారం ఏవిధంగా చేస్తారో తాము చూస్తామని అధికారులు కన్నెర్ర చేస్తున్నారు.
సీఎంఆర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు..
పలుమార్లు మిల్లర్ల సంఘం నా యకులతో సమావేశం ఏర్పాటు చే సి వారు పెట్టిన డిమాండ్లను అంగీకరించి మిల్లింగ్ చార్జీలను క్వింటా ల్‌కు రూ. 10 నుంచి రూ. 40లకు పెంచారు. తేమ శాతం విషయంలో కూడా ఇబ్బందులుంటే డ్రై మిషన్లు పెట్టి పూర్తిగా ధాన్యం తడిలేకుండా చర్యలు చేపట్టారు.
అయినా కేటాయించిన ధాన్యం తీసుకెళ్లేందుకు మిల్లర్లు మొండికేస్తుండటంతో ఈ సారి వారి సంగతి చూడాలనే ఆగ్రహంతో ఉన్నతాధికారులు ఉన్నారు. అందుకు గత నెల రోజుల నుంచే ప్రత్యామ్నాయ మార్గాల్లో కొందరు అధికారులు ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన మిల్లర్లతో సమావే శం జరిపారు.
అక్కడ మిల్లర్లు గ్యా రెంటీల విషయంలో సుముఖంగా ఉన్నారని, ప్రభుత్వం అనుమతిస్తే సీఎంఆర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాల్లో టాక్ నడుస్తుంది. వారం రోజుల క్రితం గుంటూరు, పిడుగురాళ్ల, దాచేపల్లి, కర్నూల్, నాందేడ్, బీవండి, గుల్బార్గాకు చెందిన మిల్లర్లులతో సమీప జిల్లాలకు చెందిన పౌరసరఫరాల అధికారులు సమావేశమైన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన రాష్ట్ర మిల్లర్ల అసోసియేషన్ అక్కడి వా రితో మాట్లాడి తమ వ్యాపారం దెబ్బతీయవద్దని వేడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.