19-04-2025 08:43:53 PM
అదనపు కలెక్టర్ రాంబాబు...
నాగారం: మిల్లర్లు ధాన్యాన్ని వెంట వెంటనే దిగుమతి చేసుకోవాలనీ సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అని అన్నారు. శనివారం నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామంలోనీ వర్ధమానుకోట శివారులోనీ సూర్యాపేట-జనగాం జాతీయ రహదారి 365 బి పై ఉన్న ధాన్యం లారీలు బారీగా రోడ్డు వెంట నిలిపి వేయడంతో వాసవి పారాబాయిల్డ్ మిల్లు న తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.పలు ఐకెపి నిర్వాహకులు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలు లేవని తాలు పేరుతో దిగుమతికి వచ్చిన లారీని 3 నుంచి 5 రోజులు నిలిపివేస్తున్నారని పలువురు ఐకెపి నిర్వాహకులు విన్నవించారు.
ఆయన మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రం నుండి వచ్చిన లారీలో వచ్చిన ధాన్యాన్ని అలసత్వం చేయకుండా వెంటనే దిగుమతి చేయాలని మిల్లు యజమానులకుసూచించారు.అనంతరం నాగారం మండల డి.కొత్తపల్లి గ్రామంలోనీ శివలింగ ఎంఏసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం తూకం,తేమ శాతంలో ఎలాంటి తేడాలు లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పద్మ,యశోద,స్వరూప,నిర్మల,రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.